VIDEO: కొడికొండ చెరువు కట్టకు గండి

VIDEO: కొడికొండ చెరువు కట్టకు గండి

సత్యసాయి: చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామ పంచాయతీలోని పాతచెరువు కట్టకు ఆదివారం గండి పడిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో సమీపంలోని రైతులు పండించిన పంటల్లోకి చెరువు నుంచి నీరు వెళ్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చెరువు గండి పూడ్చి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.