VIDEO: భక్తులతో పోటెత్తిన కాణిపాకం
CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. అధికారులు భక్తుల మధ్య తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.