ఆ ఉపాధ్యాయులు వద్దు.. నిరసన తెలిపిన తల్లిదండ్రులు

CTR: స్కూలుకు ఆ ఉపాధ్యాయులు వద్దు తమకు పాత ఉపాధ్యాయులే ఉండి కొనసాగాలని, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మదనపల్లె కృష్ణానగర్, పురపాలక ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను అధికారులు ఇటీవల వేరే పాఠశాలకు మార్చేశారు. ఇది తెలుసుకొన్న పిల్లల తల్లి దండ్రులు మంగళవారం స్కూలు వద్దకు చేరుకొని పాతవాళ్లనే ఉంచాలిని నిరసన తెలిపారు.