'కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలి'
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ గాజానంద్ తెలిపారు. మొత్తం నలుగురు సభ్యులను నియమించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరికి అవకాశం ఉండగా, వారిలో ఒక మహిళకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేసి, వారిలో ఒక మహిళకు ప్రాధాన్యం కల్పిస్తారు.