ఘనంగా మరిడిమాంబ అమ్మవారి జాతర

AKP: గొలుగొండ మండలం ఏఎల్ పురంలో ఘనంగా మరిడిమాంబ జాతర నిర్వహించారు. బుధ, గురు రెండు రోజులు ఘనంగా అమ్మవారి జాతరను జరుపుకున్నారు. జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ నిర్వహించారు. అధిక భక్తులు రావడంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.