27న నగరంలో ఘనంగా గణపతి ఉత్సవాలు

KKD: కాకినాడ నగర గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి నగరంలో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాల కొండయ్య తెలిపారు. శనివారం ఉదయం సాంబమూర్తి నగర్‌లో కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.