జిల్లాలో పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం

జిల్లాలో పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని అర్గొండ గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద గాలికుంటు వ్యాధి టీకా శిబిరం నిర్వహించినట్లు పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 100 పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు టీకాలు వేసిన పశువుల వివరాలను నమోదు చేశారు. పాడి రైతులు పశు వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి.