'విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి'

'విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి'

విశాఖ జిల్లాను దేశానికి ఆదర్శంగా నిలిపేలా వినూత్న అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు వేగంగా స్పందించాలని ఆదేశించారు.