'వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి'
GDWL: వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వడ్డెర సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. దేశాభివృద్ధిలో, ఆధునిక కట్టడాల నిర్మాణంలో వడ్డెరల పాత్ర వెలకట్టలేనిదని వారు గుర్తుచేశారు. 47 ఏళ్లుగా తాము ఎస్టీ హోదా కోసం పోరాడుతున్నామని, తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.