బాల్య వివాహ రహిత సమాజం నిర్మిద్దాం: చిన్నారెడ్డి
WNP: బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపు వివాహం చేయడం ద్వారా వారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు.