నేడు ఢిల్లీలో మంత్రి లోకేష్ పర్యటన
AP: మంత్రి లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ఢిల్లీ చేరుకుని.. నేరుగా పార్లమెంట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తారు. రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం నేరుగా విశాఖకు చేరుకుంటారు.