విద్యార్థులకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

WNP: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలలో విద్యార్థులకు డెంగ్యూ నిర్ధారణ అయితే వెంటనే వైద్య చికిత్సలు ప్రారంభించాలని, ఆ ప్రాంతాలలో యాంటీ లార్వా కార్యక్రమం నిర్వహించాలని ఆయన ఆదేశించారు.