VIDEO: కలుషిత ఆహారంతో 20 మంది అస్వస్థత
KKD: పెద్దాపురం సత్తిరెడ్డి పేటలో బుధవారం కలుషిత ఆహారం తిన్న సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కార్యాలయ ఇన్‌ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించి, పండ్లు అందించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.