ముల్కనూర్‌లో ముందస్తు బడిబాట

ముల్కనూర్‌లో ముందస్తు బడిబాట

KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో బుధవారం ముందస్తు బడిబాట నిర్వహించారు. 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అనే నినాదంతో స్కూల్ సిబ్బంది ఉదయం నుంచే ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆంగ్ల విద్య, డిజిటల్ బోధన, సీసీ కెమెరాలు, స్మార్ట్ టీవీలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, క్రీడలు సౌకర్యాలున్నాయని వెల్లడించారు.