'చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'

'చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'

VZM: చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బొబ్బిలి MPDO రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం స్దానిక జగన్నాథపురంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.