'ఎల్ఎండీ జలాశయంలో చేపల వేట నిషేధం'

KNR: లోయర్ మానేరు డ్యాంలో రెండు నెలలు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. జులై మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు చేపల ప్రత్యుత్పత్తి జరిపే దశలో ఉంటాయని, ఇలాంటి సమయంలో చేపలు వేట కొనసాగిస్తే ప్రత్యుత్పత్తి ఆగిపోయి చేపలు తగ్గుముఖం పడతాయని అన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన మత్స్యకారులకు లైసెన్స్‌లు రద్దు చేస్తామని తెలిపారు.