మండల రైతులకు ఏవో కీలక సూచనలు
E.G: 'దిత్వా' తుఫాన్ కారణంగా వరి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిణి రాజేశ్వరి తెలిపారు. గోకవరం మండలంలో వరి కోత కోసి కుప్ప మీద ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా బరకాలను కప్పుకోవాలన్నారు. నూర్చిన ధాన్యం 2,3 రోజులు ఎండబెట్టుకునే వీలు లేకపోతే ధాన్యం మొలకెత్తకుండా, రంగు మారకుండా ఒక క్వింటా ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలుపుకోవాలని సూచించారు.