రూ.5,102 కోట్లతో 4 రైల్వే లైన్లు!

HYD: సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రూ.5,102 కోట్లతో నాలుగు రైల్వే లైన్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపగా, 2026 బడ్జెట్లో దీనికి సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్లతో ప్రయాణం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని, సికింద్రాబాద్ రైల్వే ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.