VIDEO: అంగర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్‌ను రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా మండపేట రూరల్ సీఐ దొర రాజుతో కలిసి స్టేషన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతో, సీసీ కెమెరాలతో నేరస్తులను త్వరగా గుర్తిస్తున్నామని తెలిపారు.