ఆర్టీసీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
ఏలూరు జిల్లా ఆర్టీసీ పెట్రోల్ బంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. డిపో క్లర్క్ బాలరాజు, సీనియర్ సహాయకులు ఎమ్మెస్ రావు, సుందర రావు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రేమ్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు ప్రజా రవాణా అధికారిణి షేక్ షాబ్‌నాం తెలిపారు. నిధుల దుర్వినియోగంపై నివేదికను అనుసరించి మరికొందరిపై చర్యలు ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.