భార్యతో గొడవ పడి కెనాల్లో దూకి ఆత్మహత్య
HNK: హసన్‌పర్తి మండలం గోపాలపురానికి చెందిన సాంబయ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, భార్యతో నిత్యం గొడవలు పడుతూ మనస్తాపంతో చింతగట్టు క్యాంప్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబీకుల బుధవారం ఫిర్యాదు మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.