ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు పండ్లు, గుడ్ల పంపిణీ

WGL: వరంగల్ జిల్లా ట్రై సిటీస్ ఆధ్వర్యంలో జనయేత్రి ఫౌండేషన్, తోట శ్రీధర్, తోట విజయల సహకారంతో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40 మంది రోగులకు, వారి బంధువులకు పండ్లు, కోడి గుడ్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి తోట శ్రీధర్ ఈ సహాయం అందించడం అభినందనీయమని ఫౌండేషన్ అధ్యక్షులు మొహమ్మద్ రహీమ్ ఖాన్ తెలిపారు.