అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం.. కేసు నమోదు
ASF: రెబ్బెన మండలం ఖైర్గాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. SI వెంకట కృష్ణ తెలిపిన వివరాలు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి సుమారు 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో బియ్యం నిల్వ ఉంచిన ఎర్ర మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.