వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో పోటెత్తిన భక్తజనం
VSP: మహాశివరాత్రి పురస్కరించుకుని సోమవారం విశాఖ సాగరతీరం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచే ఆర్‌కే బీచ్, ఋషికొండ, భీమిలి వరకు భక్తులు పుణ్యస్నానాల కోసం పోటెత్తారు. శివనామ స్మరణతో తీరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు నిరంతరం పహారా కాస్తున్నారు.