మడ్డువలస రిజర్వాయర్ లీజుకు బహిరంగ వేలం
VZM: ఈ నెల 28న మడ్డువలస రిజర్వాయర్ లీజుకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రాజాం అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు గురువారం తెలిపారు. వేలంలో పాల్గొన దలిచినవారు ఆరోజు ఉదయం 11.30కు వంగరలో కొట్టిస సచివాలయం వద్ద రూ.18,21,817 డిపాజిట్ కట్టి వేలంలో పాల్లొనాలన్నారు. మరిన్ని వివరాలు కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.