సజావుగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్
ATP: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం అనంతపురం రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని 143 కేంద్రాల్లో ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.