పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించిన MLA
GDWL: గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 27 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాలలో మెడికల్, నర్సింగ్, పీజీ కళాశాలల ఏర్పాటుతో విద్యా హబ్‌గా మారిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జయలక్ష్మి, డీఈవో విజయలక్ష్మి పాల్గొన్నారు.