VIDEO: వృద్ధ దంపతులను చిరునవ్వుతో పలకరించిన ACP
HNK: ఎల్కతుర్తిలో ఇవాళ నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌లో ఓ వృద్ధ దంపతుల అన్యోన్యత చూసి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆకర్షితులయ్యారు. తన అర్హత పక్కనపెట్టి వారి వద్దకు వెళ్లి, చేతులు జోడించి యోగక్షేమాలు అడిగారు. “మీది ప్రేమ వివాహమా?” అంటూ చిరునవ్వుతో పలకరించి, వారి జీవన విధానం, కష్టాల గురించి ఆసక్తిగా ఆరా తీశారు. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది.