‘రాష్ట్రంలో 5 వేల కి.మీలకు పైగా జాతీయ రహదారులు’

‘రాష్ట్రంలో 5 వేల కి.మీలకు పైగా జాతీయ రహదారులు’

TG: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5 వేల కిలోమీటర్లు దాటిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ పెంచడం మోదీ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.3,900 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతోందని ఆయన చెప్పారు.