ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన చిన్నారెడ్డి

వనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది రిజిస్టర్ తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడుతూ..ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు, సిబ్బంది చూసుకోవాలన్నారు.