VIDEO: 'విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలి'
HYD: ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్య రంగానికి 15% నిధులు కేటాయించాలని BRSV నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి ఖాళీ బ్యాగులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్లో విద్య రంగంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మండిపడ్డారు.