సీకేఎం ఆసుపత్రిలో పసిపిల్లల వార్డులో ఎలుక పిల్లలు..!

WGL: సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్ర సమస్యగా మారింది. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ ఎలుకలు సంచారం చేస్తున్నాయి. కాగా, సోమవారం ప్రసవం అయిన పసి పిల్లలను ఉంచే వార్డులో ఏకంగా 8 ఎలుక పిల్లలు బయటపడ్డాయి. వార్డు సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో బాలింతలు, గర్భిణులు భయభ్రాంతులకు లోనయ్యారు.