పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి: ఐటీడీఏ పీవో

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి: ఐటీడీఏ పీవో

ASR: హుకుంపేట మండలం సూకూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ సందర్శించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను, వంటగదులు, స్టాక్ రూమ్, జీసీసీ సరఫరా చేసిన సరుకులు పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను, వంటగదులు, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.