500 పడకల ఆసుపత్రి భవనానికి భూమి పూజ
WNP: పట్టణంలోని మెడికల్ కాలేజీ పక్కన సుమారు రూ.257 కోట్లతో నిర్మించనున్న 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించే ఈ మెడికల్ కాలేజీ భవనం నిర్మాణం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.