కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య

కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య

మేడ్చల్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్(50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.