'మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి'

'మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో నడవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం సమకూర్చిన రూ.1.43 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును ఆయన అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు.