VIDEO: నార్నూర్‌లో పర్యటించిన ఎస్పీ
ADB: నార్నూర్ మండలంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. గాంధీ చౌక్ వద్ద ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొడవలు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరిని కించపరిచేలా, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ అంజమ్మ ఉన్నారు.