అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి: మంత్రి

అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి: మంత్రి

నంద్యాలలోని టెక్కే మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానాన్ని ఆక్రమించి నిర్మించిన గోడను తక్షణమే కూల్చివేయాలని గురువారం మున్సిపల్ అధికారులను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఆస్తులను, ఆట స్థలాలను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పాఠశాల మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంపౌండ్ గోడను వెంటనే తొలగించాలన్నారు.