ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

CTR: పూతలపట్టు మండలం పి. కొత్తకోట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు.. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కారు లారీని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.