VIDEO: మేడారం బాట పట్టిన భక్తులు.. ఖాళీ అవుతున్న గ్రామాలు
WGL: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నేపథ్యంలో బుధవారం వర్ధన్నపేట మండలంలోని గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తులు కుటుంబ సమేతంగా మేడారం బాట పట్టారు. రహదారులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల్లో భక్తుల రాకపోకలు కొనసాగుతుండగా, జాతర ప్రాంగణం వైపు అడుగడుగునా భక్తి సందడి నెలకొంది.