CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 760 మందికి రూ.7.22 కోట్లు సాయం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా దాదాపుగా రూ.100 కోట్ల చొప్పున పేదలకు సాయం అందుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.