అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్
VZM: విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సిరిమానోత్సవం సందర్భంగా గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది.