విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడు సస్పెండ్
ATP: వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు సుధాకర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో రుజువు కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుధాకర్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.