మద్యం తాగి వాహనాలు నడపొద్దు
KMM: మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ సూచించారు. ఇటీవల ఖమ్మం ముస్తఫానగర్, కాల్వొడ్డు, ఖానాపురం ప్రాంతాల్లో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, 61 కేసులు నమోదు చేశామని, అక్టోబర్‌లో మొత్తం 466 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. అలాగే, 128 రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోడీఫైడ్ సైలెన్సర్లను మార్చినట్లు చెప్పారు.