VIDEO: అగ్నిప్రమాదంలో ఇంట్లోని వస్తువులు దగ్ధం
MNCL: చెన్నూర్ మండలం సంకారం గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామంలో అక్కెం రవి ఇంట్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఫర్నిచర్, కూలర్ దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.