కోరుట్లలో చోరీ.. కేసు నమోదు
JGL: కోరుట్ల పట్టణంలోని రవీంద్ర రోడ్డులో ఇల్లుటప్పు భూమయ్య ఇళ్లు, కాలేజీ గ్రౌండ్ సమీపంలోని కటకం రాజారాం ఇంటిలో రాత్రి చోరీ జరిగిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. భూమయ్య ఇంట్లో నుంచి ఒక బంగారు చైన్, ఉంగరం, వెండి పట్టగొలుసులను దొంగలు ఎత్తుకెళ్లారు. రాజారాం ఇంట్లో 5 బంగారు ఉంగరాలు, చెవికమ్మలు, వెండి కడియాలు చోరీ అయ్యాయని కేసు నమోదు చేశామని అన్నారు.