మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు ప్రారంభం
W.G: తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా యార్డ్ లో అమ్మకాలు చేసుకోవడం ద్వారా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని యార్డ్ కార్యదర్శి వి.ప్రభాకర్. తెలిపారు. రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.