తెనాలిలో 10వ రోజుకి చేరిన నిరాహార దీక్ష

GNTR: తెనాలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగిని పద్మావతి చేపట్టిన నిరాహార దీక్ష పది రోజులకు చేరింది. వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న ఆమె, మరికొన్ని సమస్యలను లేవనెత్తారు. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని.. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలను మరమ్మతులు చేయించాలని కోరారు.