30 వేల మంది మత్స్యకారులకు కేంద్ర పథకాలు.. కలెక్టర్
కాకినాడ జిల్లాలో 119 కి.మీ. తీర ప్రాంతంలోని 30 వేల మంది మత్స్యకారులకు కేంద్ర పథకాలను వర్తింపజేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఉద్యాన, మత్స్య, ప్రకృతి వ్యవసాయ శాఖల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.