'ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి'

'ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి'

SRPT: మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అంతా విధిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో ప్రజలు ఓటు హక్కు వాడుకోవాలని సూచించారు. బ్యాలెట్ జారీ అయ్యాక సాధారణ ఓటుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు.